జమ్ము సమీపంలో పాక్ బాంబ్ ప్రయోగం.. నిర్విర్యం చేసిన భద్రతా బలగాలు

by Ramesh Goud |   (  Updated:2025-05-11 12:10:39  IST  )

భారత్ -పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి.

జమ్ము సమీపంలో పాక్ బాంబ్ ప్రయోగం.. నిర్విర్యం చేసిన భద్రతా బలగాలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (Line Of Controle) వద్ద రెండు దేశాలకు చెందిన భద్రత బలగాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. పాక్ దళాలు కొనసాగిస్తున్న కాల్పులకు భారత్ ధీటుగా కౌంటర్ ఇస్తుంది. దీంతో భారత దళాలను మట్టుబెట్టేందుకు పాక్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత భద్రతా దళాలపై మందు గుండు సామాగ్రిని ప్రమోగించాలని పాక్ యత్నించింది. జమ్మూలోని ఓ ప్రాంతంలో డ్రోన్ (Drone) సహయంతో భద్రతా దళాల కోసం భారీ మందుగుండు సామాగ్రిని అమర్చింది. జమ్ము సమీపంలోని ఓ గ్రామంలో ఈ డ్రోన్ ను గమణించిన భద్రతా దళాలు.. బాండ్ స్క్వాడ్ సాహయంతో చాకచక్యంగా పాక్ ప్రయోగించిన మందు గుండు సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ కీలక ఆపరేషన్ లో భారత ఆర్మీకి చెందిన బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) తో పాటు ఎన్ఎస్‌జీ (NSG) దళాలు పాల్గొన్నాయి.

Next Story