సార్క్‌కు పోటీగా కొత్త కూటమి?.. చర్చలు జరుపుతున్న చైనా, పాకిస్తాన్!

by Phanindra |

సార్క్‌కు పోటీగా కొత్త కూటమి?.. చర్చలు జరుపుతున్న చైనా, పాకిస్తాన్. 2014 నుంచి సార్క్ సమావేశాలు జరగకపోవడంతోనే?

సార్క్‌కు పోటీగా కొత్త కూటమి?.. చర్చలు జరుపుతున్న చైనా, పాకిస్తాన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: కొత్తగా ఒక దక్షిణాసియా దేశాల కూటమిని ఏర్పాటు చేయాలని చైనా, పాకిస్తాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త కూటమితో ప్రస్తుతం పనిచేయని సౌత్ ఏసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ (సార్క్)ను భర్తీ చేయాలని పాక్, చైనా అనుకుంటున్నాయట. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటవడం, భారత్-పాక్ ఉద్రిక్తతలు.. వంటి జియోపొలిటికల్ సమస్యల వల్ల కొంత కాలంగా సార్క్ సమావేశాలేం జరగడం లేదు. దానికితోడు ఈ కూటమిలో చైనా లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల పాక్, చైనా, బంగ్లా ప్రతినిధులు చైనాలోని కున్‌మింగ్‌లో సమావేశమయ్యారని.. ఈ మీటింగ్‌లో చైనా ఈ ప్రతిపాదన చేసిందని, సార్క్‌లో ఉన్న దేశాలను ఈ కొత్త కూటమిలో చేర్చడమే తమ లక్ష్యమని చెప్పినట్లు సమాచారం. అయితే చైనా, పాకిస్తాన్‌లతో ఎలాంటి అలయెన్స్ ఏర్పాటు చేసుకోవడం లేదని బంగ్లాదేశ్ పేర్కొంది.

కాగా, 2014 తర్వాత సార్క్ సమావేశాలు జరగలేదు. 2016లో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో మీటింగ్ జరగాల్సి ఉండగా.. అదే సంవత్సరం ఉరిలో భారత మిలిటరీ క్యాంప్‌పై పాక్ టెర్రరిస్టులు దాడి చేశారు. దీంతో తాము ఈ సమావేశానికి రాబోమని భారత్ ప్రకటించింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ కూడా మీటింగ్‌లో పాల్గొనేందుకు నిరాకరించడంతో ఆ ఏడాది సార్క్ సమావేశం రద్దయింది. ఆ తర్వాత భారత్, పాక్ ఉద్రిక్తతలు, ఇతర అంతర్జాతీయ సంక్షోభాల వల్ల సార్క్ సమావేశాలు జరగలేదు.

Next Story