- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌పై మళ్లీ దాడులకు తెగబడ్డ పాక్.. రాష్ట్రాల సీఎస్‌లకు హోంశాఖ కీలక ఆదేశాలు
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి (Ceasefire Agreement) తూట్లు పొడిచి, భారత సరిహద్దు రాష్ట్రాలపై దాడులకు తెగబడింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి (Ceasefire Agreement) తూట్లు పొడిచి, భారత సరిహద్దు రాష్ట్రాలపై దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir), రాజస్థాన్ (Rajasthan), పంజాబ్ (Panjab), గుజరాత్ (Gujarath) పై డ్రోన్లు, ఆర్టిలరి గన్‌లతో దాడికి చేస్తోంది. ఈ దాడులను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర అత్యవసర సమావేశం (Emergency Meeting) ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎస్ లతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్రం హోం శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల విరమణ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేగాక ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది.






