- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam: నన్ను పాక్ పంపకండి.. నేను భారత్ కోడలిని.. సీమా హైదర్ వీడియో వైరల్
”నన్ను పాక్ పంపకండి.. నేను భారత్ కోడలిని” అని ప్రేమించిన వ్యక్తి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన మహిళ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: ”నన్ను పాక్ పంపకండి.. నేను భారత్ కోడలిని” అని ప్రేమించిన వ్యక్తి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన మహిళ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థానీయులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అయితే, పాక్ దేశస్థురాలు సీమా హైదర్ ను దేశం నుంచి బహిష్కరిస్తారంటూ వార్తలొతచ్చాయి. దీనిపైనే ఆమె స్పందించింది. తాను భారత్ కోడలిని అని భారత ప్రధాని మోడీ నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఒకప్పుడు తాను పాక్ పౌరురాలు అని.. ఇప్పుడు తాను భారత్ కోడలినని దయ చేసి తనను ఆ దేశానికి పంపొద్దని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందూమతాన్ని స్వీకరించానని తెలిపింది. ఈవిషయంపై ఆమె తరఫు లాయర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ సీమా హైదర్‌ను దేశంలో నివసించడానికి అనుమతిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఆమె భారతీయుడ్ని పెళ్లి చేసుకుని.. ఓ కుమార్తెకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ఇక పాక్ పౌరురాలు కాదని.. దేశం వీడాల్సిన అవసరం లేదన్నారు.
సీమా హైదర్..
పాక్ కు చెందిన సీమా హైదర్ పబ్‌జీ వీడియోగేమ్‌లో పరిచయమైన సచిన్ మీనాను వ్యక్తిని ప్రేమించింది. అతడికోసం 2023లో నలుగురు పిల్లలతో సహా సరిహద్దును దాటి భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. ఆ తర్వాత తన ప్రియుడిని వివాహం చేసుకుంది. అయితే, సీమా.. పాక్ ఏజెంట్ అయి ఉంటుందని ముందు పోలీసులు అనుమానించారు. కానీ, అది తప్పని తేలింది. ఇక, తనకు ఈ దేశపౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని కూడా కోరారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కానున్నాయి. మానవతా కోణంలో మెడికల్ వీసాల గడువు ఏప్రిల్ 29 వరు మాత్రమే చెల్లుబుట కానున్నాయి. ఆలోగా ఆ వీసాపై భారత్ లో ఉన్నవారంతా దేశం వీడివెళ్లిపోవాలని ఆదేశించింది.






