- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shashi Tharoor: ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంపై శశిథరూర్ వ్యాఖ్యలు
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి క్లోజ్డ్ డోర్ సమావేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి క్లోజ్డ్ డోర్ సమావేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యదేశాల సంప్రదింపుల తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఎలాంటి తీర్మానాన్ని ఆమోదించదని థరూర్ అన్నారు. ‘‘పాకిస్థాన్‌ను విమర్శిస్తూ ఏ తీర్మానం చేసినా దాన్ని చైనా వీటోతో అడ్డుకుంటుంది. భారత్‌ను విమర్శిస్తూ తీర్మానం చేసినా చాలా దేశాలు అడ్డుకుంటాయి. శాంతి కోసం పిలుపునివ్వడం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేయడం వంటి మామూలు మాటలే వినిపిస్తాయి’’ అని అన్నారు. అధికారిక సమావేశాలు లేదా అనధికారిక సంప్రదింపుల ద్వారా రెండు దేశాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే నిర్దిష్టమైన ఏదైనా కౌన్సిల్ నుండి తాను ఏమీ ఆశించడం లేదని ఆయన అన్నారు. ఇంతకుమించి ప్రత్యేకంగా ఏమీ ఉండకపోవచ్చని అంచనావేశారు. ఇదంతా విచారకరమైన వాస్తవమని వ్యాఖ్యానించారు.
ఉగ్రదాడి..
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. సింధూజలాల ఒప్పందం నిలిపివేత, వీసాల సస్పెన్షన్ సహా పలు ఆంక్షలు విధించింది. ఇలాంటి పరిణామాల వేళ ఐక్యరాజ్యసమితి సమావేశం జరిగింది. భారత్‌కు వ్యతిరేక తీర్మానం చేయాలని ఈ సమావేశంలో తొలుత పాక్ భావించింది. కానీ, ఈ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. లష్కరే తోయిబాతో సంబంధాలు, ఇస్లామాబాద్ బహిరంగ అణు బెదిరింపులపై చాలా సభ్యదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇటీవల ఆ దేశం క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని ప్రశ్నించాయి.






