- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్‌కు ఖనిజాల ఎర.. మినరల్స్‌ను చూపించిన పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్!
by Phanindra |
ట్రంప్‌కు పాకిస్తాన్ ఖనిజాల ఎర వేసింది. తమ దేశంలో దొరికిన మినరల్స్‌ను ఆయనకు పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ శాంపిల్స్ చూపించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: తమదేశంలో లభించిన ఖనిజాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కొన్ని రాళ్లను చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసింది. ఈ ఇద్దరు పాక్ నేతలు ఇటీవలే వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే ఈ ఖనిజాలను ఆయనకు వాళ్లు చూపించినట్లు సమాచారం. పాక్‌లోని ఖనిజాలపై యూఎస్ కన్నేసిందని, అందుకే ఆ దేశానికి అంతర్జాతీయంగా మద్దతిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫొటోలు చర్చనీయాంశంగా మారాయి. పాక్‌లో ఖనిజాల కోసం అక్కడి ఫ్రంటీర్ వర్క్స్ ఆర్గనైజేషన్‌తో ఇప్పటికే యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ అనే సంస్థ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే.
Next Story






