Pakistan: భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వారికోసమే..

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్- భారత్ మధ్య దౌత్యవిభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత పాకిస్థాన్‌ అట్టారీ-వాఘా సరిహద్దుని ఇరు దేశాలు మూసివేశాయి.

Pakistan: భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వారికోసమే..
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్- భారత్ మధ్య దౌత్యవిభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత పాకిస్థాన్‌ అట్టారీ-వాఘా సరిహద్దుని ఇరు దేశాలు మూసివేశాయి. కాగా.. ఈ సరిహద్దుని శుక్రవారం మరోసారి తెరిచింది. భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వారి కోసం ఈ చర్యలు చేపట్టింది. ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీయులకు జారీ చేసిన స్వల్పకాలిక వీసాలను భారత్ రద్దు చేసింది. గతనెల 30న పాక్ ఈ సరిహద్దుని పూర్తిగా మూసివేసింది. అప్పటివరకు భారత్‌ నుంచి 911 మంది పాక్‌ జాతీయులు స్వదేశానికి వెళ్లారు. ఆతర్వాత దాదాపు 24 గంటలపాటు పాకిస్థాన్‌ నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో భారత్‌లో నిలిచిపోయినవారు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా ఆ సరిహద్దును తెరిచి.. తమ జాతీయులను వెనక్కి తీసుకొంటోంది. ఇక భారత్‌ మొత్తం మూడు రకాల వీసాల వారిని దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. కానీ, వీరికి ఉపశమనం ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చినా.. అధికారిక సమాచారం ఏమీ లేదు.

వీసా రద్దుపై..

భారత్‌ వీసాలు రద్దు చేయడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంపై దృష్టిపెడతామని పాక్ విదేశాంగశాఖ పేర్కొంది. ముఖ్యంగా మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకొంటున్నవారు మధ్యలో తిరిగి స్వదేశాలకు రావాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించింది. దీనిపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి షఫీక్‌ అహ్మద్‌ స్పందిస్తూ.. ‘‘భారత్‌ నిర్ణయంతో చాలామంది ట్రీట్మెంట్ తీసుకోకుండానే వెనక్కి వస్తున్నారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల నుంచి వేరవుతున్నారు. భారత్‌ ఇచ్చిన నోటీసు గడువు ముగిసినా.. అక్కడే కొందరు పాకిస్థానీయులు ఉన్నట్లు మీడియా ద్వారా తెలిసింది. సరిహద్దులు తెరిచి వారిని కూడా వెనక్కి రప్పిస్తాం’’ అని పేర్కొన్నారు.

Next Story