కాల్పుల విరమణ ఉల్లంఘన ఆరోపణల్ని ఖండించిన పాక్ మంత్రి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-11 06:57:56  IST  )

భారత్ - పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ (India-Pak Cease Fire Break) జరిగిన కొద్దిగంటలకే పాక్ డ్రోన్లు, ఆర్టిలరీ గన్లతో సరిహద్దు నగరాలపై దాడి చేసిందన్న ఆరోపణలను పాక్ సమాచార, ప్రసారశాఖ మంత్రి అత్తావుల్లా తరార్ (Attahullah Tarar) స్పష్టం చేశారు.

కాల్పుల విరమణ ఉల్లంఘన ఆరోపణల్ని ఖండించిన పాక్ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ (India-Pak Cease Fire Break) జరిగిన కొద్దిగంటలకే పాక్ డ్రోన్లు, ఆర్టిలరీ గన్లతో సరిహద్దు నగరాలపై దాడి చేసిందన్న ఆరోపణలను పాక్ సమాచార, ప్రసారశాఖ మంత్రి అత్తావుల్లా తరార్ (Attaullah Tarar) ఖండించారు. పాక్ మరోమారు కాల్పులు జరిపితే ఇండియన్ ఆర్మీ (Indian Army) తగిన రీతిలో బదులిస్తుందని హెచ్చరించిన నేపథ్యంలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడే ఆలోచన కూడా తమకులేదని, ఇది తమకు విజయోత్సవ సమయం అని, ప్రజలంతా ఆనందోత్సాహాల్లోఉన్నారని జియోన్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

భారత్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, ఒకసారి ఒప్పందం జరిగిన తర్వాత ఉల్లంఘించే ప్రసక్తే లేదన్నారు. పాక్ వైపు నుంచి ఎలాంటి ఉల్లంఘన జరగలేదని ఆయన తెలిపారు. కాగా.. కాల్పుల విరమణ జరిగిన కొద్ది గంటలకే పాక్ కాల్పులకు పాల్పడటంపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రెస్ మీట్ నిర్వహించి.. దీనిపై పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నియంత్రణరేఖ (LoC) వెంబడి ఉల్లంఘనలు పునరావృతమైతే కఠినంగా వ్యవహరించాలని సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Next Story