Pakistan : పాకిస్తాన్ లో ఆకాశాన్నంటిన ధరలు

by Muthe.Rajitha |   (  Updated:2025-04-28 10:13:43  IST  )

పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) అనంతరం పాక్ పట్ల భారత్, భారత్ పట్ల పాక్ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Pakistan : పాకిస్తాన్ లో ఆకాశాన్నంటిన ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) అనంతరం పాక్ పట్ల భారత్, భారత్ పట్ల పాక్ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సరిహద్దులో భారీగా సైనికులను మొహరించడం, ఆయుధాలను చేరవేయడం చూస్తుంటే రెండు దేశాల మధ్య యుద్ధం(Bharat-Pak War) తప్పదనే సూచనలు బలంగా కనిప్పిస్తున్నాయి. అదే విధంగా ఇరు దేశాలు అన్ని రకాల వ్యాపార, దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు(Essential Prices) ఆకాశాన్ని తాకాయి. మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా వాటి ధరలు చుక్కల్లోకి చేరడంతో పాక్ సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పాక్ ద్రవ్యోల్బణం(Inflation) విపరీతంగా పెరగడంతో.. బియ్యం, కూరగాయలు, మాంసం, పండ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

పలు నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర రూ.800, కిలో బియ్యం రూ.350, డజను గుడ్లు రూ.333, లీటర్ పాలు రూ.225, టమాటా కిలో రూ.170 రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం, పలు ఎన్జీవోస్ అందించే సహాయం కోసం నిరుపేదలు ఎదురు చూస్తున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిన దాయాది దేశానికి పెరిగిన ద్రవ్యోల్బణం మరింత దెబ్బ కానుంది. ఈసారి పాక్ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి వెళ్ళడం ఖాయం అని, మరో యాభై ఏళ్ల దాకా ఆ దేశం కోలుకోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Next Story