గుండె తరుక్కుపోయే ఘటన.. ఇండియాలో తల్లి, పాకిస్థాన్‌కు పిల్లలు..మోడీకి రిక్వెస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-27 11:58:37  IST  )

పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా అమాయక ప్రజలు ఇబ్బంది పడాల్సివస్తోంది.

గుండె తరుక్కుపోయే ఘటన.. ఇండియాలో తల్లి, పాకిస్థాన్‌కు పిల్లలు..మోడీకి రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా అమాయక ప్రజలు ఇబ్బంది పడాల్సివస్తోంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే కారణంతో భారత్ ఆ దేశంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ పౌరులు ఇండియా విడిచి వెళ్లిపోవాలని ప్రధాని ఆదేశించారు. మరోవైపు పాక్ సైతం భారతీయులు పాకిస్థాన్‌ను వీడాలని ఆదేశించారు. దీంతో కొంతమంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే గుండెతరుక్కుపోవాల్సిందే. 11 ఏళ్ల జైనాబ్, 8 ఏళ్ల జెనిష్ తమ తల్లి నబీలాతో కలిసి పాకిస్థాన్ నుండి నెల రోజుల క్రితం ఢిల్లీలోని తమ అమ్మమ్మ ఇంటికి వచ్చారు.

నబీలాకు ఇండియా పౌరసత్వం ఉంది. కానీ ఆమె భర్త పాకిస్థానీ కావడంతో అక్కడే స్థిరపడ్డారు. దీంతో భర్తకు, పిల్లలకు పాకిస్థాన్ పౌరసత్వం ఉంది. పహల్గామ్ దాడి తరవాత పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో నబీలా ఇద్దరు పిల్లలు, భర్త పంజాబ్ గుండా పాకిస్థాన్ వెళ్లిపోయారు. కానీ నబీలాకు భారత పౌరసత్వం ఉండటంతో ఆమెను పాకిస్థాన్‌లో అడుగుపెట్టనివ్వరు. పిల్లలను తనతో ఇండియాలో ఉండనివ్వరు. దీంతో ఇద్దరు పిల్లలు ఇద్దరూ తల్లిని వీడాల్సిన పరిస్థితి వచ్చింది.

వారు పాక్ వెళుతున్న సమయంలో పంజాబ్ బార్డర్‌లో మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న వీడియో అందరి హృద‌యాల‌ను క‌ల‌చివేసింది. చిన్నారి జైనాబ్ మాట్లాడుతూ.. త‌మ త‌ల్లిని త‌మ‌తో పంపించాల‌ని లేదంటే త‌మ‌ను ఇండియాలో ఉండ‌నివ్వాల‌ని కోరింది. త‌న త‌ల్లిని పాకిస్థాన్ రావాల‌ని ప‌లుమార్లు కోరిన‌ట్టు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మ‌రోవైపు 8 ఏళ్ల జెనిష్ త‌న త‌ల్లి లేకుండా ఉండ‌లేన‌ని ఏడ్చేశాడు. మ‌రో కుటుంబం ప‌రిస్థితి కూడా ఇలానే ఉండ‌టంతో వారు కూడా త‌మ‌కు ప‌రిష్కారం చూపించాల‌ని ప్ర‌ధాని మోడీని కోరుతున్నారు. త‌ల్లి లేకుండా పిల్ల‌లు ఉండ‌లేర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story