- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌లోని రిలయన్స్ రిఫైనరీని టార్గెట్ చేశాం: పాక్ ఆర్మీ చీఫ్
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను దెబ్బకొట్టేందుకు.. రిలయన్స్ రిఫైనరీని టార్గెట్ చేశామని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: జామ్‌నగర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ రిఫైనరీని టార్గెట్ చేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరో షాకింగ్ హెచ్చరిక చేశారు. భారత్‌లోని ఆర్థిక ఆస్తులను తాము టార్గెట్ చేస్తామని, ముఖ్యంగా ఆయిల్ వసతులపై దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ నేరుగా హెచ్చరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫ్లోరిడాలోని టాంపాలో ఏర్పాటు చేసిన డిన్నర్‌లో పాల్గొన్న మునీర్.. ముఖేష్ అంబానీ పొటోతోపాటు ఖురాన్ పంక్తులు రాసి ఉన్న ఒక సోషల్ మీడియా పోస్టును అక్కడి వారికి గుర్తుచేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము ఏం చేయగలమో భారత్‌కు చూపించేందుకు ఈ దాడులకు అనుమతులు ఇచ్చానని మునీర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పోస్టులోని ఖురాన్ పంక్తులను బట్టి చూస్తే రిలయన్స్ రిఫైనరీలపై వాయు మార్గంలో దాడులు చేసేందుకు మునీర్ ప్రయత్నించినట్లు అర్థం అవుతోంది.






