మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిడా కాహ్లో ఘనత.. వేలంలో రికార్డు ధరకు పెయింటింగ్

by Kema Shiva Kumar |

మెక్సికన్ చిత్రకారిణి ఫ్రిడా కహ్లో గీసిన ఒక అద్భుతమైన చిత్రానికి న్యూయార్క్‌లోని సోథెబైస్ సంస్థ వేలంలో 54.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.460 కోట్లు) ధర పలికింది.

మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిడా కాహ్లో ఘనత.. వేలంలో రికార్డు ధరకు పెయింటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికన్ చిత్రకారిణి ఫ్రిడా కహ్లో గీసిన ఒక అద్భుతమైన చిత్రానికి న్యూయార్క్‌లోని సోథెబైస్ సంస్థ వేలంలో 54.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.460 కోట్లు) ధర పలికింది. ఈ పెయింటింగ్ ప్రపంచంలో స్త్రీ కళాకారులు గీసిన అన్ని చిత్రాల కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం సంచలన రికార్డుగా నమోదైంది. ఈ ఘనత ఇంతకు ముందు జార్జియా ఓ’కీఫ్ గీసిన “జిమ్సన్ వీడ్/వైట్ ఫ్లవర్” చిత్రం పేరిట ఉండేది. ఆ చిత్రం 2014లో 44.4 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. ఫ్రిడా కహ్లో గీసిన ఈ పెయింటింగ్ ఒక ప్రైవేట్ కలెక్షన్ నుంచి వచ్చింది. అయితే, మెక్సికోలో ఫ్రిడా చిత్రాలు ఎక్కువగా జాతీయ సాంస్కృతిక వారసత్వంగా పరిగణించబడతాయి. అవి దేశం బయటకు తీసుకెళ్లడం, నాశనం చేయడం పూర్తిగా నిషేధం. కాబట్టి, ఇలా ఒక ఫ్రిడా పెయింటింగ్ అంతర్జాతీయ వేలంలోకి రావడం అత్యంత అరుదు. తాజాగా న్యూయార్క్, లండన్, బ్రసెల్స్ నగరాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శనకు పెట్టాలని అభ్యర్థనలు వచ్చాయి.

Next Story