- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pahelgam: పహెల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల సెలబ్రేషన్స్.. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి !
జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే దాడి అనంతరం ఉగ్రవాదులు సంబురాలు చేసుకున్నారని, గాల్లోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపి సెలబ్రేషన్స్ చేశారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో వెల్లడైంది. ముగ్గురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని, అనంతరం ఘటన జరిగిన వెంటనే గాలిలోకి ఫైరింగ్ చేశారని ప్రత్యక్ష సాక్షి ఎన్ఐఏకి తెలిపినట్టు సమాచారం. ఆయన బైసరన్ లోయ నుంచి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు ఆయనను ఆపి గాల్లోకి కాల్పులు జరిపారని చెప్పారు. దాడి జరిగిన టైంలో ఇద్దరు స్థానికులు పర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్‌లు బైసారన్‌లో ఉగ్రవాదుల లగేజీకి సెక్యురిటీగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి.
వారిద్దరినీ గత నెలలో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అలాగే ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని, లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారని వెల్లడైంది. దాడికి ఒక రోజు ముందు టెర్రరిస్టులు తమ ఇంటికి వచ్చాడని పర్వేజ్ విచారణలో వెల్లడించారు. దాదాపు నాలుగు గంటలు తమ ఇంటి వద్ద కూర్చుని బైసారన్‌లో భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల సమావేశ స్థలాలు, మార్గాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్టు ఎన్ఐఏకు తెలిపాడు. కాగా, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.






