- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajastan: పహల్గాం ఉగ్రదాడి.. ఆగిన రాజస్థాన్ యువకుడి పెళ్లి
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో (Pahalgam terror attack) 28 మంది భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో (Pahalgam terror attack) 28 మంది భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే పాక్ పౌరుల వీసా రద్దు చేసింది. దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను జారీ చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలతో రాజస్థాన్‌కు (Rajastan) చెందిన ఓ యువకుడి పెళ్లి ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్లితే..
రాజస్థాన్‌కు చెందిన సైతాన్ సింగ్ (Saitan Singh) అనే వ్యక్తికి పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఇందులో భాగంగా పెళ్లి పనుల నిమిత్తం పెళ్లి కొడుకు బంధువులు కొంత మంది పాకిస్థాన్‌లోని పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు. అయితే ఇంతలోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో భాగంగా అట్టారి-వాఘా సరిహద్దును భారత్ మూసివేయటంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిశ్చితార్థం దాకా వచ్చిన సైతాన్ సింగ్ వివాహం నిలిచిపోయింది. అయితే తన పెళ్లి ఆగిపోవడంపై వరుడు సైతాన్ సింగ్ స్పందించాడు. ఉగ్రవాదులు చేసింది క్షమించరాని తప్పని అన్నాడు. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో పాటు తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నాడు. పాక్ వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయంతో సరిహద్దులు మూసివేశారని, దీంతో తాము ఇప్పుడు పాకిస్థాన్‌కు వెళ్లలేకపోతున్నామని చెప్పాడు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అన్నాడు.






