- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాదుల సమాచారం ఇస్తే రూ. 20 లక్షల బహుమతి: పోలీసుల సంచలన ప్రకటన
ఉగ్రవాదుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతిని అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు..

X
దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్(Pahalgam)లో 26 మంది పర్యటకులను ఉగ్రవాదులు(Terrorists) బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్ర చర్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతికారం తీర్చుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు ఉగ్రవాదుల ఎరివేతకు కేంద్రప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అనంత్‌నాగ్ పోలీసులు(Anantnag police) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడి తర్వాత పిరికిపందల్లా పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల సమాచారంపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదుల సమాచారాన్ని తెలిపిన వారిని రూ. 20 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Next Story






