పహల్గాం టెర్రర్ అటాక్.. ప్రధాని మోడీపై ఖర్గే షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-06 09:35:42  IST  )

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లా పహల్గాం (Pahalgam)లో ఉగ్రమూకలు సృష్టించిన మారణ హోమం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

పహల్గాం టెర్రర్ అటాక్.. ప్రధాని మోడీపై ఖర్గే షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లా పహల్గాం (Pahalgam)లో ఉగ్రమూకలు సృష్టించిన మారణ హోమం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. విహార యాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పుల్వామా దాడి తరువాత కశ్మీర్‌ లోయలో జరిగిన మరో అతిపెద్ద దాడి ఇదే కావడం దురదృష్టకరం. ఏప్రిల్ 22న జరిగిన ఈ ఉగ్రదాడిలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 28 మంది టూరిస్టులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇప్పటికే నిషేధిత లష్కర్-ఎ-తోయిబా (Lashkar-e-Taiba) అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (‘The Resistance Front’) ప్రకటించుకుంది.

ఈ నేపథ్యంలోనే పహల్గాం టెర్రర్ అటాక్‌పై ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రధాని మోడీకి ముందస్తు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. ఆ తరువాతే ఆయన కశ్మీర్ పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారని తెలిపారు. ఉగ్రదాడిపై సమాచారం ఉన్నా.. ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. ఏప్రిల్‌ 22న పహల్గాం దాడి ఘటనకు 3 రోజుల ముందే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం నివేదికను పంపిందని ఖర్గే చెప్పడం ఇప్పుడు పొలిటికల్‌గా బీజేపీ, కాంగ్రెస్ మధ్య నిప్పు రాజేస్తోంది.

Read More: IMF: పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు భారత్ ప్రయత్నాలు

Next Story