పహల్గాం ఉగ్రదాడి.. పరిహారంపై జమ్మూకశ్మీర్ సర్కార్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లా పహల్గాం (Pahalgam)లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 28 పర్యాటకులు మరణించారు.

పహల్గాం ఉగ్రదాడి.. పరిహారంపై జమ్మూకశ్మీర్ సర్కార్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లా పహల్గాం (Pahalgam)లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 28 పర్యాటకులు మరణించారు. అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. అయితే, పాకిస్తాన్‌ (Pakistan)కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (LET) ఉగ్రవాద సంస్థ షాడో గ్రూప్ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్’ (Resistance Front) ఆ దాడి తామే చేశామంటూ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలోనే జమ్మూకశ్మీర్ సర్కార్ (Jammu Kashmir Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.లక్ష ఇవ్వనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు..

ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హుటాహుటిన శ్రీనగర్‌ (Srinagar)కు వెళ్లారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అమిత్ షా.. మృతుల కుటుంబాలతో మాట్లాడి కన్నీరుమున్నీరవుతోన్న వారిని ఓదార్చారు.

Next Story