పహల్గాం ఉగ్రదాడి ఆర్థిక యుద్ధ చర్యతో సమానం: విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

పహల్గాం ఉగ్రవాద దాడి (Pahelgam Terror Attack) కాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించిన ఆర్థిక యుద్ధ చర్యతో సమానమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అన్నారు.

పహల్గాం ఉగ్రదాడి ఆర్థిక యుద్ధ చర్యతో సమానం: విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రవాద దాడి (Pahelgam Terror Attack) కాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించిన ఆర్థిక యుద్ధ చర్యతో సమానమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అన్నారు. ఇవాళ న్యూయార్క్‌ (New York)లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ (World Trade Center)లో 9/11 మెమోరియల్ సమీపంలో ఉన్న న్యూస్‌వీక్ ప్రధాన కార్యాలయంలో న్యూస్‌వీక్ సీఈఓ దేవ్ ప్రగద్ (Dev Pragad) హోస్ట్ చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు సవాళ్లు విసురుతున్నప్పటకీ, అణు బెదిరింపులకు తాము భయపడేది లేదని అన్నారు. అక్కడి నుంచి చర్యకు కచ్చితంగా ప్రతి చర్య ధీటుగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 22 పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత దేశంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయని అన్నారు. భారతదేశం గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొందని తెలిపారు. పహల్గాం దాడి భారత్‌పై ఆర్థిక యుద్ధ చర్యగా భావించామని అన్నారు. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారమైన పర్యాటక రంగాన్ని నాశనం చేసేందుకు ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయని పేర్కొన్నారు. ఇది మతపరమైన హింసను రెచ్చగొట్టడానికి కూడా ఉద్దేశించబడిందని ఫైర్ అయ్యారు. పహల్గాం టెర్రర్ అటాక్‌లో బాధితులను వారి మంతం తెలుసుకుని చంపేశారని ధ్వజమెత్తారు. అలాంటి వారిని ఎలా వదిపెట్టాలని.. వారికి సరైన శిక్ష వేయకుండా ఉండలేమని జైశంకర్ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Next Story