- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : పహల్గాం ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) నివాసంలో జరిగిన అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఈ భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది. ఇకపై ఏ ఒక్క పాక్ పౌరున్ని భారత్ లోకి అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పింది.
పాక్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే పాక్ హైకమీషనర్ దేశాన్ని వీడాలని సూచించింది. అటారి చెక్ పోస్టును వెంటనే మూసి వేస్తున్నట్టు తెలిపింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని, దానికి ఖచ్చితమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా ఉగ్రదాడిపై రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.






