- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గాం టెర్రర్ అటాక్.. FBI చీఫ్ కాష్ పటేల్ సంచలన ట్వీట్
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది టూరిస్టులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది టూరిస్టులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ దాడి చేసింది తామేనంటూ లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (The Resistance Front) ప్రకటించుకుంది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు భారత్ (India)కు అండగా నిలబడుతున్నాయి. ఉగ్రవాదంపై చేసే పోరులో తాము కూడా భాగస్వాములమవుతామంటూ వివిధ దేశాధినేతలు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి మద్దతుగా సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పహల్గాం టెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack)పై ప్రపంచ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) చీఫ్ కాష్ పటేల్ (Kash Patel) సంచలన ట్వీట్ చేశారు. కశ్మీర్ (Kashmir)లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి బాధితులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. భారత ప్రభుత్వానికి (Indian Government) తమ పూర్తి సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉగ్రవాద రూపంలో ప్రపంచం నిరంతరం ఎదుర్కొంటున్న ముప్పులకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. బాధితుల కోసం ప్రార్థిద్దాం. ‘ఇలాంటి క్లిష్ట సమయాల్లో బ్యాటిల్ ఫీల్డ్ (Battle Field)లో పోరాడుతోన్న భద్రతా బలగాలకు ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.






