- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Terror Attack : దాయాది పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్
పహల్గాం ఉగ్రదాడి (Pahelgam Terror Attack) నేపథ్యంలో దాయాది పాక్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం (Indian Government) ఒక్కొక్కటి తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahelgam Terror Attack) నేపథ్యంలో దాయాది పాక్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం (Indian Government) ఒక్కొక్కటి తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ (Pakistan) విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తోంది. ఈ పరిణామంతో ఆగ్నేయాసియా (Southeast Asia) గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పాకిస్థాన్ (Pakistan) విమానాలు ఇక చైనా (China) లేదా శ్రీలంక (Srilanka) మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి దాపురించనుంది.
అదేవిధంగా పాకిస్థాన్ (Pakistan) నౌకలు కూడా భారత ఓడరేవులకు రాకుండా పూర్తిగా నిషేధం విధించే దిశగా కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే, భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ ఇప్పటికే దాయాది దేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు సరిహద్దులో దాయది పాకిస్థాన్ (Pakistan) కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇవాళ తెల్లవారుజామున అఖ్నూర్ సెక్టార్ (Akhnoor Sector)లో పాక్ రేంజర్లు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.
పహల్గామ్ ఉగ్రదాడిలో వెలుగులోకి సంచలన విషయాలు.. పాకిస్తాన్ స్పష్టమైన పాత్ర
మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోండి.. పవన్ సంచలన వ్యాఖ్యలు






