- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan: మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోండి.. పవన్ సంచలన వ్యాఖ్యలు
కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ ను ప్రేమిస్తామని చెబుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మతం అడిగి మరీ హత్య చేశారు..
మత పరంగా దాడి జరిగితే చెప్పడానికి భయమెందుకు?
ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదు
పహల్గాం అమరుల నివాళి కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ (pakistan) ను ప్రేమిస్తామని చెబుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోండని హితవు పలికారు. మంగళగిరి ఎస్కన్వెన్షన్లో పహల్గాం (Pahalgam) అమరులకు నివాళి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా చెబుతున్నవారంతా కాంగ్రెస్నాయకులన్నారు. వీరిలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణాదిలో కూడా కొంతమంది ఇదే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లోనే విబేధాలున్నాయని అన్నారు. భారత్దేశంపై దాడి జరిగినపుడు ఇటువైపు నిలబడాలి తప్ప పాకిస్తాన్వైపున నిలబడతామని చెప్పడం ఏంటన్నారు. ఇదేం సెక్యులరిజం అని ప్రశ్నించారు. దీనిని ఎవరూ ఒప్పుకోరని అన్నారు. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అన్నారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర మూకలు (Terrorist) మతం అడగి మరీక్ష ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో భద్రత అత్యంత ముఖ్యం అన్నారు. మతపరంగా దాడి జరిగితే చెప్పడానికి భయం ఎందుకని ప్రశ్నించారు. చనిపోయిన 26 మందిలో 25 మంది హిందువులు అని, ఒకరు మాత్రమే ముస్తిం అని తెలిపారు. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని తెలుసుకుని కాల్పులు జరిపారన్నారు. ఎంతో నమ్మకంతో కాశ్మీర్(Kasmir) పర్యటను వెళ్లారని తెలిపారు.
భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలన్నారు. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నపుడు ప్రశాంతంగా ఉందన్నారు. ఇకపై ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదన్నారు. షికారుకు వచ్చినట్లు వచ్చి మనుషులను చంపారని తెలిపారు. సరిహద్దులను సక్రమంగా చూసుకోకపోతే ఇటువంటి ఘటనలే జరుగుతాయన్నారు. అమాయకులను అత్యంత దారుణంగా చంపారని ఆదేవన వ్యక్తం చేశారు. ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కలచి వేసిందన్నారు. నిరాయుధులతో యుద్ధం చేయకూడదన్నారు. ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలన్నారు. ఉగ్రవాదులు హిందువులను టార్గెట్‌చేసి చంపడం సత్యం అన్నారు. హిందువులకు ఇది ఒకటే దేశమన్నారు. ఇక్కడ కూడా టార్గెట్‌చేసి చంపితే ఎక్కడికి పోవాలన్నారు. నిత్యం మోదీని (Modi) విమర్శించే నాయకులు కూడా ఒక్కటయ్యారని తెలిపారు. సత్యాన్ని మాట్లాడడానికి శక్తి, ధైర్యం కావాలన్నారు. ఈ దేశానికి మత సామరస్యం అవసరం అన్నారు. ముస్లింలకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదట మాట్లాడేది నేనే అన్నారు. మన దేశానికి సహనం ఎక్కువైపోయిందన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడం ధైర్యంతో కూడుకున్న పని అన్నారు.






