పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ కు మిత్ర దేశాల బిగ్ షాక్

by Ramesh Goud |   (  Updated:2025-04-25 15:34:56  IST  )

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ (Pakisthan) కు మిత్రదేశాలు (Friendly Countries) షాక్ ఇచ్చాయి.

పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ కు మిత్ర దేశాల బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ (Pakisthan) కు మిత్రదేశాలు (Friendly Countries) షాక్ ఇచ్చాయి. ఉగ్రచర్యపై తన వైఖరిని స్పష్టం చేయడానికి మధ్యవర్తిత్వం (Mediation) వహించేందుకు మిత్ర దేశాలు మందుకు రాలేదు. పహల్గామ్ ఉగ్రచర్య (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్థాన్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్ ఇప్పటికే పాకిస్థాన్ తో సింధు నది జలాల ఒప్పందం సహా పలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అంతేగాక పాకిస్థాన్ పౌరులను ఇండియా విడిచి పెట్టాలని అలాగే పాక్ లో ఉన్న భారతీయులను తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉలిక్కిపడిన పాక్ సహాయం కోసం మిత్ర దేశాల వైపు చూసింది. కానీ పాక్ కు మిత్ర దేశాలు పెద్ద షాక్ ఇచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై తన వైఖరిని చెప్పేందుకు మధ్యవర్తిత్వం చేయాలని పాకిస్థాన్ తన మిత్ర దేశాలను సంప్రదించింది. కానీ పాకిస్థాన్ కి సహాయం చేసేందుకు ఒక్క మిత్రదేశం కూడా ముందుకు రాలేదు.

ఈ విషయాన్ని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ ను అన్నీ దేశాలు ఒంటరి చేయాలని నిర్ణయించుకున్నాయా అనే చర్చలు మొదలయ్యాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా అని భయపడుతున్న పాకిస్థాన్ కు మిత్రదేశాల షాక్ తో మరో ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది. కాగా మిని స్విట్జర్లాండ్ గా పిలుచుకునే బైసరన్ ప్రాంతంలో ట్రెక్కింగ్ కు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడులలో 26 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రవాద చర్యను భారతీయులే గాక ముస్లిం దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి.

Next Story