- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గాం దాడి ఉగ్రమూకల పైశాచికత్వాన్ని చాటింది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
పహల్గాం దాడి ఉగ్రమూకల పైశాచికత్వాన్ని చాటిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం దాడి ఉగ్రమూకల పైశాచికత్వాన్ని చాటిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చైనాలోని తియాన్‌జిన్ వేదికగా 25వ శాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర దేశాధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిగణించిందని అన్నారు. ఈ సమస్యతో భారత్ గత 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఎస్‌సీవో సభ్యులుగా భారత్ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. ఎస్‌సీవో కోసం భారత్ భద్రత, అసుసంధానం, అవకాశాలు అనే మూడు పిల్లర్లపై ఆధారపడి ఉందని తెలిపారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. భారత అభివృద్ధిలో ఎస్‌సీవో దేశాలు భాగస్వా్మ్యం కావాలని ఆహ్వానించారు. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సభ్య దేశాలన్నీ సంయమనంతో సవన్వయం చేసుకుంటు ముందుకు వెళ్లాలని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి వేళ భారత్‌కు మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎస్‌సీవో వేదికగా పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఆ దేశ వైఖరిని ప్రధాని తప్పుబట్టడం హైలెట్‌గా నిలిచింది.






