Padma awards : పద్మ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి.. 71 మందికి ప్రదానం

by B.Srinivas |

2025 ఏడాదికి గాను పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు.

Padma awards : పద్మ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి.. 71 మందికి ప్రదానం
X

దిశ, నేషనల్ బ్యూరో: 2025 ఏడాదికి గాను పద్మ అవార్డు (Padma awards) లకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadhi murmu) అవార్డులను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ (Rashtrapathi bhavan) లో జరిగిన కార్యక్రమంలో 71 మందికి అవార్డులు ప్రదానం చేశారు. వారిలో నలుగురు పద్మ విభూషణ్ (Padma Vibhushan) ,10 మంది పద్మ భూషణ్ (Padma Bhushan), 57 మంది పద్మశ్రీ (Padmasri) అవార్డులు అందుకున్నారు. అవార్డులతో సత్కరించబడిన ప్రముఖుల్లో సినీ నటుడు బాలకృష్ణ, డాక్టర్ నాగిరెడ్డి, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, గోవా స్వాతంత్ర్య ఉద్యమ నాయకురాలు లిబియా, కళాకారిణి భీమవ్వ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, పారిశ్రామికవేత్త పవన్ కుమార్ గోయెంకా సహా ఇతరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi), ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. కాగా, ఈ ఏడాదికి గాను వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 75 మంది మాత్రమే అవార్డులు అందుకోగా మిగిలిన వ్యక్తులను త్వరలోనే ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించనున్నారు.

Next Story