Oxygen: ఆక్సిజన్, ఐసొలేషన్ బెడ్లు సిద్ధం చేయండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు !

by B.Srinivas |   (  Updated:2025-06-04 14:42:51  IST  )

దేశంలో కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Oxygen: ఆక్సిజన్, ఐసొలేషన్ బెడ్లు సిద్ధం చేయండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ (Oxygen), ఐసోలేషన్ బెడ్స్ (Isoation beds), వెంటిలేటర్స్ (Ventilaters), అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్డర్స్ ఇచ్చినట్టు సన్నిహిత వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ నెల 2, 3 తేదీల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) డాక్టర్ సునీతా శర్మ అధ్యక్షతన కొవిడ్ పై సమీక్ష సమావేశాలు జరిగాయని, ఈ భేటీలోనే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని అంచనా వేయడానికి ఈ సమావేశం జరిగినట్టు పేర్కొన్నాయి.

కొవిడ్ సంస్థాగత పరిస్థతిలుపై బుధవారం, గురువారం మాక్ డ్రిల్స్ సైతం చేపట్టినట్టు తెలిపాయి. ప్రజలు చేతుల శుభ్రత పాటించాలని, అనారోగ్యంగా ఉన్నప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని, తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు లక్షణాలు తీవ్రమైతే స్వీయ పర్యవేక్షణ చేసుకుని వైద్య సహాయం తీసుకోవాలని అధికారిక వర్గాలు సూచించాయి. తప్పుడు సమాచారాన్ని నమ్మోద్దని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్, పీఐబీ విడుదల చేసే ఇన్ఫర్మేషన్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపాయి. కాగా జూన్ 4 నాటికి దేశంలో 4,302 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

Next Story