మమత ప్రసంగాన్ని అడ్డుకున్న ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులు.. సీఎం ధీటైన సమాధానానికి ప్రశంసలు

by Ramesh Goud |

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్ పర్యటనలో ఉన్నారు.

మమత ప్రసంగాన్ని అడ్డుకున్న ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులు.. సీఎం ధీటైన సమాధానానికి ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal CM Mamatha Benargy) లండన్ పర్యటన (Lundon Tour)లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University) లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీనికి ఆమె ధీటైన సమాధానం ఇచ్చి, విద్యార్థుల నుంచే ప్రశంసలు (Praises) పొందారు. ఆక్స్‌ఫర్డ్ లోని కెల్లాగ్ కళాశాల బృందం (Kellag College) చిన్నపిల్లలు, మహిళలు, అణగారిన వర్గాల సమాజిక అభివృద్ధిపై ప్రసంగించేందుకు సీఎం మమతను ఆహ్వానించారు. ఆమె ప్రసంగిస్తుండగా.. కొందరు విద్యార్థులు ఆమె ప్రసంగానికి అంతరాయం కలిగించారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస, ఆర్జీకర్ ఘటన (RG Kar Issue) సహా పలు ఫ్లాకార్డులను ప్రదర్శిస్తూ.. నిరసన తెలియజేశారు.

దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి ఆమె తన ప్రసంగాన్ని ఆపకుండా.. మర్యాదగా వ్యవహరిస్తూ నిరసన కారులకు సమాధానం ఇచ్చారు. నిరసనకారులు మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడుతుండగా.. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ మాటలు వినిపించట్లేదు అని మమత చెప్పారు. అలాగే మీరు చెప్పేదంతా నేను వింటాను అంటూ.. ఆర్జీకర్ కేసు పెండింగ్ లో ఉందని తెలుసా? ప్రస్తుతం ఈ కేసును కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, కేసు మన చేతిలో లేదని అన్నారు. అంతేగాక ఇక్కడ రాజకీయాలు చేయకండి.. ఇది రాజకీయాలకు వేదిక కాదని, దీనికి బదులు నా రాష్ట్రానికి వెళ్లి నాతో రాజకీయం చేయండి, తద్వారా మీ పార్టీని బలోపేతం చేసుకోండి అని నిరసనకారులకు సూచించారు.

దీంతో ఒక్కసారిగా కార్యక్రమంలోని వారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అనంతరం నిరసనకారులు తమ గొంతును ఎత్తేందుకు ప్రయత్నించగా.. మమత కలగజేసుకొని, నన్ను అవమానించడం ద్వారా మీ సంస్థను అగౌరవపరచవద్దు.. నేను దేశ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను.. దీని ద్వారా మీ దేశాన్ని అవమానించవద్దు అని అన్నారు. తర్వాత కార్యక్రమ నిర్వాహాకులు, ప్రేక్షకులు నిరసన కారులకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో నిరసనకారులు అక్కడి నుంచి వెనుదిరగక తప్పలేదు. నిరసనకారులకు ధైర్యంగా సమాధానం ఇచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమయస్పూర్తికి ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే కార్యక్రమంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు.

Next Story