Owaisi: ఆరు సీట్లిస్తే ‘ఇండియా’లో చేరతాం.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్

by B.Srinivas |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఆరు సీట్లు కేటాయిస్తే ఇండియా కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

Owaisi: ఆరు సీట్లిస్తే ‘ఇండియా’లో చేరతాం..  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఆరు సీట్లు కేటాయిస్తే ఇండియా కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అన్నారు. బిహార్‌లోని కిషన్ గంజ్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎంఐఎంకు 6 సీట్లిస్తే ఇండియా అలయెన్స్‌లో జాయిన్ అవుతామని, ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. నిర్ణయం వారి చేతుల్లోనే ఉందని, బీజేపీకి సాయం చేస్తున్నారనే ఆరోపణలు తమపై రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రతిపాదనపై ఇండియా కూటమి నుంచి సరైన స్పందన లేకపోతే బీజేపీకి ఎవరు సాయం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. అనంతరం నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. అయితే ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం ఓట్లను చీల్చుతోందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ప్రకటన చేశారు.

Next Story