రూ. 900 కోట్లకు పైగా అక్రమాస్తులు, హవాలా ఆరోపణలు.. కేజ్రీవాల్ ఇళ్లపై ఈడీ దాడులు

by Malleboina Mahesh |

చార్టెడ్ అకౌంటెంట్, హవాలా ఆపరేటర్‌గా అనుమానిస్తున్న నరేష్ కుమార్ కేజ్రీవాల్ నివాసం తో పాటు అతని కుటుంబ సభ్యులు, సహచరుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది.

రూ. 900 కోట్లకు పైగా అక్రమాస్తులు, హవాలా ఆరోపణలు.. కేజ్రీవాల్ ఇళ్లపై ఈడీ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: చార్టెడ్ అకౌంటెంట్, హవాలా ఆపరేటర్‌గా అనుమానిస్తున్న నరేష్ కుమార్ కేజ్రీవాల్ నివాసం తో పాటు అతని కుటుంబ సభ్యులు, సహచరుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. రాంచీకి చెందిన అతనిపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA)లోని సెక్షన్ 37 కింద ఈ సోదాలు రాంచీతో పాటు ముంబై, సూరత్‌లలో ఏకకాలంలో జరుగుతున్నాయి. కేజ్రీవాల్ లెక్క చూపని విదేశీ షెల్ కంపెనీలను నియంత్రిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) వెల్లడించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. కేజ్రీవాల్ నియంత్రణలో ఉన్న ఈ షెల్ కంపెనీలు యూఏఈ, నైజీరియా, యూఎస్ఏ వంటి దేశాలలో ఉన్నప్పటికీ, వాటి కార్యకలాపాలు అన్నీ భారత్ నుంచే జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

నరేష్ కుమార్ కేజ్రీవాల్ నియంత్రణలో ఉన్న విదేశీ సంస్థలు రూ. 900 కోట్లకు పైగా లెక్క చూపని నిల్వలను కూడబెట్టాయి. అంతేకాకుండా, ఈ నిధుల నుంచి సుమారు రూ. 1,500 కోట్లను బోగస్ టెలిగ్రాఫిక్ బదిలీల ద్వారా (bogus telegraphic transfers) తిరిగి భారత్‌కు మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అక్రమ లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించేందుకు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్, అతని అసోసియేట్లపై విదేశీ మారక ద్రవ్యాల ఉల్లంఘన ఆరోపణలు రుజువైతే, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story