- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 1000 మంది మృతి
by Naga Rani Yarlagadda |
కొండ చరియలు (Land Slides) విరిగిపడి 1000 మంది మృతి చెందారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కొండ చరియలు (Land Slides) విరిగిపడి 1000 మంది మృతి చెందారు. ఈ ఘోర విషాద ఘటన ఆఫ్రికా దేశమైన సూడాన్ లో చోటుచేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడగా.. ఒక గ్రామమంతా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రకృత్తి విపత్తులో 1000 మందికి పైగా ప్రజలు మరణించినట్లు సూడాన్ లిబరేషన్ మూమెంట్/ ఆర్మీ ధృవీకరించింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గత నెల 31న కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఆ గ్రామంలో ఈ విపత్తు తర్వాత ఒక్కరే బ్రతికి ఉన్నట్లు చెప్పారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఎక్కుగా ఉన్నట్లు సమాచారం. సూడాన్‌లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Next Story






