- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bengaluru stampede: విధుల్లో కేవలం వెయ్యి మంది పోలీసులే..!
బెంగళూరు తొక్కిసలాట (Bengaluru stampede) ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు తొక్కిసలాట (Bengaluru stampede) ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వెయ్యి మందికిపైగా పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నట్లు తేలింది. తొక్కిసలాట ఘటనపై విమర్శలు రావడంతో ఈ వ్యవహారాన్ని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) సుమోటోగా పరిగణించింది. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.స‘‘వేడుక కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం విషాదంగా మారింది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలను మనం నివారించగలమా? భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయగలం? అన్నవి ఆలోచించాలి’’ అని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసుల వివరాలను ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేవలం వెయ్యిమంది మాత్రమే విధుల్లో ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఆర్సీబీ ఈవెంట్‌కు 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా..
విచారణ సందర్భంగా తాము నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘‘రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం. వాటర్ ట్యాంకర్లు, అంబులెన్స్‌లు, కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలను సిద్ధంగా ఉంచాం. ఈ స్టేడియం సామర్థ్యం 35వేలు మాత్రమే. సాధారణ సమయాల్లో 30వేల టికెట్లు మాత్రమే ఇస్తారు. కానీ, ఆ కార్యక్రమానికి దాదాపు 2.5లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు. అందరినీ లోపలికి పంపిస్తారని వారు భావించారు. మధ్యాహ్నం నుంచే రద్దీ మొదలవ్వగా.. సాయంత్రానికి కిక్కిరిసిపోయి పరిస్థితి చేయిదాటిపోయింది’’ అని వివరించారు. ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలిచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.






