- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ జైళ్లలో 10,574 మంది భారతీయులు.. 43 మందికి మరణశిక్ష!
విదేశీ జైళ్లలో 10,574 మంది భారతీయులు ఉన్నారని, వారిలో 43 మంది మరణశిక్ష ఎదుర్కొంటున్నారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: విదేశాల్లో మొత్తం 10,574 మంది భారతీయులు జైల్లో శిక్షలు అనుభవిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ సహాయక మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
యూఏఈలో అత్యధికంగా 2,773 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారని ఆయన తెలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా (2,379), నేపాల్ (1,357), ఖతార్ (795), మలేసియా (380), కువైట్ (342), యూకే (323), బహ్రెయిన్ (261), పాకిస్తాన్ (246), చైనా (183) తదితర దేశాలున్నాయి.
ఇక వీరిలో 43 మంది మరణశిక్ష ఎదుర్కొంటున్నారని, యూఏఈలో అత్యధికంగా 21 మంది డెత్ పెనాల్టీ ఫేస్ చేస్తున్నారని కీర్తి వర్ధన్ సింగ్ తెలియజేశారు. అలాగే సౌదీలో ఏడుగురు, చైనాలో నలుగురు, ఇండోనేషియాలో ముగ్గురు, కువైట్‌లో ఇద్దరు మరణశిక్ష పడిన భారతీయులున్నట్లు వెల్లడించారు. వీరితోపాటు యూఎస్, మలేసియా, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, యెమెన్‌లో ఒక్కొక్కరు చొప్పున ఇదే పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిపారు.






