Dera Baba: డేరాబాబాకు బెయిల్.. సిర్సా ఆశ్రమంలో బస

by Shamantha N |

హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్‌ సింగ్ కు మరోసారి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు.

Dera Baba: డేరాబాబాకు బెయిల్.. సిర్సా ఆశ్రమంలో బస
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్‌ సింగ్ కు మరోసారి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేందుకు డేరా బాబా ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చారు. అయితే, డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పాటు పెరోల్ వచ్చింది. అయితే, డేరాబాబా నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకోనున్నారు. దోషిగా తేలినప్పటినుంచి ఆయన సిర్సాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆశ్రమంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే, డేరా బాబా 2024 అక్టోబర్‌లో బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పుడు ఆయన 20 రోజుల పాటు యూపీలోని బర్నావా ఆశ్రమంలో ఉన్నారు. 2017లో డేరాబాబాను దోషిగా తేలారు. అప్పడి నుంచి ఆయనకు బెయిల్ మంజూరు చేసి 12వ సారి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలో పోలింగ్ కు ముందు బెయిల్ రావడం ఎనిమిదోసారి. ఇకపోతే, ఈ రాష్ట్రాల్లోనే డారాబాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వాయువ్య ఢిల్లీలోని తూర్పు ఆజాద్ నగర్, కంఝవాలా దగ్గర డేరాబాబాకు బ్రాంచెస్ ఉన్నాయి.

వీడియో మెసేజ్ రిలీజ్

డేరాబాబా తన పెరోల్ సమయంలో సిర్సాలో బస చేయాలని అభ్యర్థించారని అధికారులు తెలిపారు. అయితే, సిర్సా జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆమోదం తెలిపాక.. ఆయనను సిర్సా వెళ్లేందుకు అనుమతించినట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే, సిర్సా చేరుకున్న వెంటనే డేరాబాబా వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. “ దేవుడి దయవల్ల నేను మీకు సేవ చేయడానికి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఈసారే నేను సిర్సాలోని షా సత్నామ్ జీ ధామ్‌కు వచ్చాను. సిర్సాకు రావద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ సంబంధిత ప్రదేశాల్లో ఉండండి. సేవాదార్ల సూచనలను పాటించండి” అని పేర్కొన్నారు. ఇక, 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలాగే, 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో ముగ్గురు దోషులుగా తేలారు.

Next Story