- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Gandhi: బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీ 140 సీట్లకు మించి గెలిచేది కాదని కూడా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల పారదర్శకతపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో, దాదాపు ప్రతి ఆరుగురు ఎంపీలలో ఒకరు 'ఓట్ల చోరీ' ద్వారా గెలిచారని ఆయన ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీ 140 సీట్లకు మించి గెలిచేది కాదని కూడా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ పరిభాషలో వారిని 'చొరబాటుదారులు' అని పిలవాలా అని ప్రశ్నించారు. అలా అనుకుంటే, హర్యానాలో ఉన్న ప్రభుత్వం మొత్తం 'చొరబాటుదారుల చేతిలో ఉందని' బీజేపీపై ఫైర్ అయ్యారు. ఓటర్ల జాబితాను, ఎన్నికల ప్రక్రియను తమ జేబులో పెట్టుకున్న సంస్థలే దుర్వినియోగం చేస్తున్నాయి. ఆయా సంస్థలు 'రిమోట్ కంట్రోల్'తో నడుస్తున్నాయని ఎన్నికల సంఘంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఉదాహరణలు ప్రస్తావిస్తూ.. అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన 'సీట్లు దొంగిలించబడ్డాయి' అన్న వ్యాఖ్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.






