మన అంతరిక్ష రంగం మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉంది: ప్రధాని మోడీ

by Malleboina Mahesh |   (  Updated:2025-11-02 13:56:34  IST  )

ఈ రోజు "ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) LVM3–M5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

మన అంతరిక్ష రంగం మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉంది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు "ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) LVM3–M5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపిన CMS–03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహం భారత భూభాగంతో పాటు సమీప సముద్ర ప్రాంతాలపై విస్తృత కవరేజ్‌ అందిస్తుంది. కనీసం 15 సంవత్సరాలపాటు సేవలు అందించేలా రూపొందించిన ఈ మల్టీ–బ్యాండ్‌ ఉపగ్రహం, అనేక కొత్త సాంకేతికతలను కలిగి ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఈ ప్రయోగం కీలక మైలురాయిని తాకింది. ఈ “బాహుబలి రాకెట్‌ LVM3 ప్రయోగం విజయవంతం అవ్వడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన తన ట్వీట్‌లో.. " మన అంతరిక్ష రంగం మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉంది. భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు అభినందనలు. మన అంతరిక్ష శాస్త్రవేత్తల శక్తితో, మన అంతరిక్ష రంగం శ్రేష్ఠత, ఆవిష్కరణలకు పర్యాయపదంగా మారడం ప్రశంసనీయం. వారి విజయాలు జాతీయ పురోగతిని పెంచాయి. లెక్కలేనన్ని జీవితాలకు సాధికారత కల్పించాయి." అని ప్రధాని మోడీ ఇస్రో విజయాన్ని కొనియాడారు.

Next Story