ఢిల్లీ వీధుల్లో కుక్కలపై ఉత్తర్వులు.. సీజే బీఆర్‌ గవాయ్‌ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఢిల్లీ (Delhi) వీధుల్లో కుక్కలపై సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీ వీధుల్లో కుక్కలపై ఉత్తర్వులు.. సీజే బీఆర్‌ గవాయ్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi) వీధుల్లో కుక్కలపై సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు (Animal Lovers), లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో పాటు మరికొందరు నాయకులు సుప్రీం తీర్పుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీధి కుక్కలపై కోర్టు తీర్పు సరైంది కాదని ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే, తాజాగా ఇదే అంశంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ (Supreme Court Chief Justice BR Gavai) స్పందించారు. ఢిల్లీ వీధుల్లో కుక్కలపై ఉత్తర్వులను తాను పరిశీస్తానని హామీ ఇచ్చారు.

కాగా, ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించరాదని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా స్టెరిలైజ్‌ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల కాటు వల్ల రేబీస్‌ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా పిల్లలు దీనికి గురవుతుండడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 5 వేల వీధి కుక్కల కోసం 6 నుంచి 8 వారాలలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఒక కోర్టు ఆదేశాలకు ఎవరైనా వ్యక్తులు, సంస్థలు అడ్డుపడినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జస్టిస్‌ పార్థీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ ధర్మాసనం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

Next Story