స్పీకర్‌పై అభిశంసన?.. ఖర్గే చాంబర్‌లో విపక్ష నేతల నిర్ణయం!

by Phanindra |

స్పీకర్‌పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఖర్గే చాంబర్‌లో విపక్ష నేతల నిర్ణయం తీసుకున్నాయి!

స్పీకర్‌పై అభిశంసన?.. ఖర్గే చాంబర్‌లో విపక్ష నేతల నిర్ణయం!
X

దిశ, నేషనల్ బ్యూరో: బడ్జెట్ సమావేశాల 9వ రోజు కూడా పార్లమెంటులో రగడ కొనసాగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకున్నందుకు స్పీకర్ ఓంబిర్లాపై అభిశంసన పెట్టే అంశాన్ని విపక్షాలు పరిశీలిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాహుల్‌ను మాట్లాడకుండా అడ్డుకున్నందుకు, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోనందుకు, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేసేందుకు ప్లాన్ వేశారని అబద్ధపు ఆరోపణలు చేసినందుకు, 8 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసింనందుకు స్పీకర్‌పై అభిశంసన తీర్మానం పెట్టాలని విపక్షాలు అనుకుంటున్నాయట. సుమారు 100 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు పెడతారని, ఈ తీర్మానాన్ని మంగళవారం నాడు పార్లమెంటులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జు్న్ ఖర్గే చాంబర్‌లో జరిగిన మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కమ్యూనిటీస్టు పార్టీలు. టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), ఆర్‌ఎస్పీ తదితర పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొనట్లు సమాచారం.

ప్రశ్నలకు భయపడే..: రాహుల్

పార్లమెంటుకు ప్రధాని మోడీ గైర్హాజరవడంపై స్పీకర్ ఓంబిర్లా చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఖండించారు. ప్రధానిపై కాంగ్రెస్ నేతలు దాడి చేసేందుకు ప్లాన్ వేశారని, అందుకే ఆయన్ను సభకు రావొద్దని తాను కోరినట్లు ఓంబిర్లా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసిన రాహుల్.. నరవణే పుస్తకంపై చర్చకు, తనకు ఎదురయ్యే ప్రశ్నలకు భయపడే సభకు మోడీ రావడం లేదని విమర్శించారు.

Next Story