Indian immigrants: భారతీయులను వెనక్కి పంపడంపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

by Ramesh Naini |

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

Indian immigrants: భారతీయులను వెనక్కి పంపడంపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా(America)లో అక్రమంగా నివసిస్తున్న (Indian immigrants) భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని నేరస్థులుగా చేతులు కట్టి బహిష్కరించడంపై హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే గురువారం (Parliament) పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. భారతీయులను అమెరికా బహిష్కరించడంపై ఉభయ సభల్లో సభలో చర్చకు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ధర్నా దిగారు. బేడీలు వేసుకోని నిరసన తెలిపారు. భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నించారు. మరోవైపు ఈ ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తన చేతికి సంకెళ్లు వేసుకోని నిరసనలో పాల్గొన్నారు.

Next Story