ప్రతిపక్షాలు మాతో కలిసి రావాలి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-19 05:59:47  IST  )

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పటికే సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) పేరును ఇప్పటికే ఖరారు చేసింది.

ప్రతిపక్షాలు మాతో కలిసి రావాలి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పటికే సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) పేరును ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలిచే బలం ఉన్నప్పటీకీ.. భాగస్వామ్య పక్షాలతో పాటు ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు బీజేపీ (BJP) ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)తో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఎన్డీఏ ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌‌ను ప్రధాని మోడీతో పాటు, కేంద్ర మంత్రులు సన్మానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున ఎన్డీఏ పార్లమెంట్ భేటీలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, రామ్మోహన్ నాయుడు పాల్గొని ఆయనను సన్మానించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 22న వచ్చిన నామినేషన్ల పరిశీలించనున్నారు. 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించి అదే రోజుల ఫలితాన్ని వెల్లడించనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ, లోక్‌సభలో 786 ఎంపీలు ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే 394 మ్యాజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎకగ్రీవం కోసం రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh), ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసిన తరుణంలో ప్రధాన పత్రిపక్షం కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story