ప్రధాని మోడీపై దాడికి విపక్షాల కుట్ర.. లోక్‌సభ సెక్రటేరియట్ బిగ్ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-05 09:43:17  IST  )

ప్రధాని నరేంద్ర మోడీపై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని లోక్‌సభ సెక్రటేరియట్ సంచలన ప్రకటన విడుదల చేసింది

ప్రధాని మోడీపై దాడికి విపక్షాల కుట్ర.. లోక్‌సభ సెక్రటేరియట్ బిగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)పై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని లోక్‌సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) సంచలన ప్రకటన విడుదల చేసింది. మహిళా విపక్ష ఎంపీలు అంతా కలిసి మోడీ కుర్చీని చుట్టిముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla), రాష్ట్రపతి ప్రసంగంపై పీఎం మోడీ మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించారని పేర్కొన్నారు.

కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఇవాళ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించాల్సిన సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా విపక్షాలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు నేరుగా ట్రెజరీ బెంచీల వైపు దూసుకెళ్లి, ప్రధాని నరేంద్ర మోడీ కూర్చునే కుర్చీని చుట్టుముట్టారు. ప్రధాని సభలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్య ఉన్నట్లు ట్రెజరీ బెంచీ సభ్యులు ఆరోపించారు.

Lok Sabha: 2004 తర్వాత తొలిసారి.. పీఎం స్పీచ్ లేకుండానే తీర్మానం ఆమోదం

Next Story