- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lok Sabha: 2004 తర్వాత తొలిసారి.. పీఎం స్పీచ్ లేకుండానే తీర్మానం ఆమోదం
పార్లమెంట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని ఇచ్చే సమాధానం అనంతరం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదిస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని ఇచ్చే సమాధానం అనంతరం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదిస్తారు. అయితే, ఈసారి సమావేశాల్లో 2004 తర్వాత ఫస్ట్ టైమ్ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రసంగం లేకుండానే లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఇండియా (INDIA) కూటమి ఎంపీలు సభలో నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు.
2020 చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీని అనుమతించలేదని ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం కూడా ప్రధాని మోడీ సభలో మాట్లాడాల్సి ఉండగా.. విపక్షాల నిరసనల కారణంగా సభ వాయిదా పడింది. ఇవాళ కూడ కూడా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినట్లుగా ప్రకటించి సభను వాయిదా వేశారు.






