- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. ఓటింగ్ టై అయితే?
స్పీకర్ ఓం బిర్లాపై లోక్ సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దానిపై సభలో చర్చించేందుకు 10 గంటల సమయం కేటాయించింది.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత తొలిరోజే రాజకీయ సెగలు రేపింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ కోసం ఏకంగా 10 గంటల సమయాన్ని కేటాయించారు.
స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్.. స్పీకర్ ఓం బిర్లా ‘ఉదారతను’ కొనియాడటంపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు ప్రయత్నించిన విపక్ష ఎంపీల విజ్ఞప్తిని తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలు ఇచ్చిన అన్ని నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఛైర్మన్.. సభా కార్యక్రమాలను కొనసాగించారు. ఓంబిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది.
స్పీకర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలంటే సాధారణ మెజారిటీ అవసరం. అవిశ్వాసం నెగ్గాలంటే 273 మంది ఓట్లు కావాలి. కానీ.. సభలో 543 మందిలో NDA బలం 293, INDIAకూటమి బలం (234)గా ఉంది. ఓం బిర్లా కూడా సభలో ఒక సభ్యుడిగా ఓటు వేసే అవకాశం ఉంది. కానీ ఓటింగ్ టై అయితే.. ఓం బిర్లా ఓటు చెల్లకుండా పోతుంది. అవిశ్వాసంపై ఎవరి అభిప్రాయం ఏంటో త్వరలోనే తెలియనుంది.






