జాతీయ రాజకీయాల్లో సంచలనం.. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం?

by Prasad Jukanti |

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాజకీయ వేడీ రాజేశాయి.

జాతీయ రాజకీయాల్లో సంచలనం.. స్పీకర్ ఓం బిర్లాపై  విపక్షాల అవిశ్వాస తీర్మానం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రదర్శించిన పుస్తకం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అధికార విపక్షాల మధ్య బిగ్ ఫైట్ గా మారింది. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీరుపై అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్‍తో విపక్షాలు తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో 94సీ ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సభలో గందరగోళం:

సోమవారం ఉదయం లోక్ సభ ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడింది. భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై చర్చించాలంటూ విపక్షాలు సభలో నినాదాలు చేశాయి. విపక్షాల నినాదాలతో ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగింది. దీంతో సభ ప్రారంభమైన ఏడు నిమిషాలకే లోక్ సభను స్పీకర్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

Next Story