- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు
ఉభయ సభల్లో విపక్ష సభ్యులు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)తో పాటు బీజేపీ, ఎన్నికల సంఘంపై ‘ఓటు చోరీ’ అంశంపై ప్లకార్డులతో ఆందోళనకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉభయ సభల్లో విపక్ష సభ్యులు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)తో పాటు బీజేపీ, ఎన్నికల సంఘంపై ‘ఓటు చోరీ’ అంశంపై ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పదే పదే సభకు అడ్డుపడ్డారు. దీంతో విపక్ష సభ్యులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫైర్ అయ్యారు. ‘ప్రజలు మిమ్మల్ని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి ఎన్నుకోలేదు’ అంటూ ఆయన కామెంట్ చేశారు. సభా నియమాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా నినాదాలు చేస్తున్నంత శక్తిని ప్రశ్నలు అడగడంలో వినియోగించాలని సూచించారు. అప్పుడే దేశ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
అయితే, ఆగస్టు 21న ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదాల పర్వంతో కొనసాగుతున్నాయి రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి ప్రముఖ విపక్ష నాయకులు బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ, ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తూ వస్తుంది.






