- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా కూటమికి పోటీగా ఎన్నికల కమిషన్‌ను కలిసిన బీజేపీ
ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజే మిగిలింది. ఈ క్రమంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, వాటి ఫలితాల ప్రకటన తర్వాతే ఈవీఎంలను తెరవాలని కోరింది. అయితే, ఇండియా కూటమికి పోటీగా బీజేపీ నేతలు సైతం ఈసీ వద్దకు వెళ్లారు. అందులో భాగంగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు సమన్వయ ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. 'వారు నేరుగా ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు ముప్పు కలిగిస్తున్నారు' అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సంతకాలతో బీజేపీ లేఖలు ఈసీకి సమర్పించింది. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్య సంస్థలను అప్రతిష్టపాలు చేసే పనులు చేస్తున్నాయని, ఆపై ఎన్నికల ప్రక్రియను నిందిస్తాయి. ఇటీవల సుప్రీంకోర్టులో ఈవీఎంలపై పిటిషన్ వేసిన అంశాన్ని ప్రస్తావించింది. 'ప్రతిపక్షాల స్పష్టమైన మోడల్ ముందుగా ప్రజాస్వామ్య సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం. వాటి ప్రక్రియ, నిబంధనలను అడ్డుకోవడం. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ, ఈవీఎం, వీవీప్యాట్‌లపై ప్రశ్నలు, కేసులు లేవనెత్తుతాయని బీజేపీ తన లేఖలో పేర్కొంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమికి కారణాలను వెతికే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. జరగబోయే నష్టాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారనే అనే వాస్తవాన్ని అంగీకరించేందుకు ప్రతిపక్షాలు ఇష్టపడవని బీజేపీ నేతలు వెల్లడించారు.






