- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడు?
పహెల్గామ్ ఉగ్రదాడిపై ఆపరేషన్ సిందూర్ తో భారత్ ప్రతీకారం తీసుకుంది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గామ్ ఉగ్రదాడిపై ఆపరేషన్ సిందూర్ తో భారత్ ప్రతీకారం తీసుకుంది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. అయితే.. పాక్- భారత్ మధ్య వివాదం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలతో ప్రారంభమైంది. కశ్మీర్ తమ జీవనాడి లాంటిదని పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఇటీవలే వ్యాఖ్యానించాడు. ప్రతి విషయంలోనూ హిందూ ముస్లింలు భిన్న ధ్రువాలని, అందుకే తమ పూర్వీకులు రెండు దేశాలుండాలని పట్టుబట్టి సాధించారని పేర్కొన్నాడు. కాగా.. ఈ వ్యాఖ్యల తర్వాతే పహెల్గాం దాడి జరిగింది. అయితే, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్నుంచి ఆయన మాయమయ్యారు. ఆపరేషన్ సిందూర్ పై ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
వ్యక్తిగత ఆశయాల కోసమే..
పాక్ ఆర్మీలో ఆసిమ్ మునీర్ కు అంతగా ఆదరణ లేదని తెలుస్తోంది. ఆసిమ్ మునీర్.. వ్యక్తిగత ఆశయాలు, అతి ప్రవర్తన కారణంగానే భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిపై కీలకమైన పాకిస్థాన్ ప్రభుత్వ బ్రీఫింగ్‌కు తన పార్టీ హాజరు కాదని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. "ఇది కేవలం ప్రభుత్వ బ్రీఫింగ్, జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి ఎలాంటి తీవ్రమైన ప్రయత్నం జరగలేదు. ఈ భేటీకి ఇమ్రాన్ ఖాన్ వంటి ముఖ్యమైన జాతీయ నాయకుడిని ఆహ్వానం అందలేదు. ఈ బ్రీఫింగ్‌లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పాల్గొనాల్సిన అవసరం లేదని మేం నమ్ముతున్నాం" అని పీటీఐ పేర్కొంది. మరోవైపు, ఆసిమ్ మునీర్ కో-కమాండర్లలో కొందరు అతని ఆలోచనలతో ఏకీభవించడం లేదని రక్షణ నిపుణులు, రిటైర్డ్ మేజర్ జనరల్ రాజన్ కొచ్చార్ అన్నారు. ఆసిమ్ మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే అన్నారు.






