ఉగ్రవాదం ఉన్నంత వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగాలి.. ఉగ్రదాడి మృతుడి భార్య సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

ఉగ్రవాదం (Terrorism) ఉన్నంత వరకు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగాలని పహల్గామ్ ఉగ్రవాద మృతుడి భార్య కోరుకున్నారు.

ఉగ్రవాదం ఉన్నంత వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగాలి.. ఉగ్రదాడి మృతుడి భార్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదం (Terrorism) ఉన్నంత వరకు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగాలని పహల్గామ్ ఉగ్రవాద మృతుడి భార్య కోరుకున్నారు. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో జరిగిన ఉగ్రచర్య (Terror Attack) అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీంతో భారత్ సరిహద్దు రాష్ట్రాలపై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ చేపడుతున్న దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొంది. భారత్ -పాక్ సరిహద్దులలో పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్న అనంతరం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement) జరిగింది.

భారత్ -పాక్ మధ్య జరిగిన ఈ ఒప్పందంపై పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన శుభం ద్వివేది (Shubham Dwivedi) భార్య ఐశణ్య ద్వివేది (Aishanya Dwivwdi) మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ఆపరేషన్ సిందూర్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయబడినందుకు కృతజ్ఞురాలిని అని చెప్పారు. అలాగే తనకు సాయుధ దళాలు, ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)పై గొప్ప నమ్మకం ఉందని, ఈ పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిందని అన్నారు. మోడీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే ఈ పోరాటాన్ని ప్రారంభించారని, ఉగ్రవాదం ఉన్నంత వరకు, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు ఐశణ్య వెల్లడించారు.

Next Story