- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: పాక్ రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు.. పలు దేశాల ఎన్ఎస్ఏలకు అజిత్ దోవల్ ఫోన్
ఆపరేషన్ సిందూర్ (Opearation Sindoor) నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పలు దేశాల జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఫోన్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Opearation Sindoor) నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పలు దేశాల జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ (Pakisthan), పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు జరిపింది. బుధవారం తెల్లవారుజామున జరిపిన ఈ దాడులలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దాడులపై వివరణ ఇచ్చేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (National Security Advisor Ajith Doval) పలు దేశాల సెక్యూరిటీ ఏజెన్సీలకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన.. అమెరికా ఎన్ఎస్ఏ (US NSA), విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యూకే భద్రతా సలహాదారు జోనాథన్ పావెల్, సౌదీ ఎన్ఎస్ఏ ముసైద్ అల్ ఐబాన్, యూఏఈ ఎన్ఎస్ఏ హెచ్.హెచ్ షేక్ తహ్నూన్, యూఏఈ ఎన్ఎస్‌సీ సెక్రటరీ జనరల్ అలీ అల్ షమ్సి, జపాన్ ఎన్ఎస్ఏ మసటకా ఒకానోతో సహా ఇతర దేశాల భద్రతా సలహాదారులతో మాట్లాడారు. అలాగే సీపీసీ సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఫ్రెంచ్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోన్, రష్యన్ ఎన్ఎస్ఏ సెర్గీ షోయిగుతో కూడా సంప్రదింపులు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సిందూర్ కోసం తీసుకున్న చర్యలు, అమలు పద్దతి గురించి వివరించారు. అంతేగాక ఇది మేజర్ ఆపరేషన్ కాదని, భారత్ ఇప్పటికీ కూడా సంయమనంతో ఉందని చెప్పారు. అలాగే భారత్ కు తీవ్రతరం చేయాలనే ఉద్దేశం లేదని, కానీ పాకిస్థాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే, దాని పరిణామాలు భారీగా ఉంటాయని, ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో జాతీయ భద్రతా ఏజెన్సీ ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేస్తుందని అజిత్ దోవల్ సంభాషించారు.
Read More: Vyomika Singh: ఎవరు ఈ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్?






