- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. స్థావరాలను మార్చుకుంటున్న ఉగ్రవాద సంస్థలు
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత వాయు సేన అనేక ఉగ్ర స్థావరాలను ద్యంసం చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిద దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌లో భాగంగా భారత వాయుసేన.. పీఓకే తో పాటు పాక్‌లో ఉన్న ప్రముఖ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం (Terrorist camps destroyed) అయిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్ దాడులతో అప్రమత్తం అయిన ప్రముఖ ఉగ్రవాద సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed), హిజ్బుల్ ముజాహిదీన్ (Hizbul Mujahideen) స్థావరాలను పీఓకే నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా (PoK to Khyber)కు మారుస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భారత వాయు సేన వద్ద పాత స్థావరాల కచ్చితమైన అడ్రస్ ఉండటంతో భద్రతాపరంగా రిస్క్ అని తెలిసి.. క్యాంప్‌లను వదిలి సరిహద్దు ప్రాంతాల వైపు వెళ్తున్నట్లు సైనిక సిబ్బంది చెబుతున్నారు. అయితే కొన్ని రిపోర్ట్స్‌లో మాత్రం ఉగ్రవాదులు ఖైబర్ పఖ్తుంఖ్వా (KPK) వంటి ప్రాంతాల్లోకి ఆకలితో వెళ్తున్నట్లు చెబుతున్నాయి. ఈ పరిణామం ఉగ్రవాదుల హెండ్‌క్వార్టర్స్ (Terrorist headquarters)పై నేరితీసుకునే ఒత్తిడిని చూపే దశగా మారుతున్నాయి. ఒకవైపు ఇది ఇండియాకు తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తే, మరోవైపు కొత్త హెచ్చరికలను సైతం జారీ చేస్తున్నాయి.






