మోడీకి దౌత్య బృందాల బ్రీఫింగ్.. మీటింగ్ ఎప్పుడంటే?

by Phanindra |

మోడీకి దౌత్య బృందాల బ్రీఫింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9 లేదా 10న ప్రధానితో దౌత్య బృందాల నేతలు సమావేశం అవనున్నారు.

మోడీకి దౌత్య బృందాల బ్రీఫింగ్.. మీటింగ్ ఎప్పుడంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్రను ఎండగట్టేందుకు వివిధ దేశాలకు అఖిలపక్ష దౌత్యబృందాలు వెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తం 33 దేశాల్లో పర్యటించిన ఈ బృందాలు.. పహెల్గాం ఉగ్రదాడి, అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’ చేసిన పరిస్థితులను ఆయాదేశాల ప్రభుత్వాలకు వివరించారు. ఈ బృందాలన్నీ తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత ప్రధాని మోడీతో సమావేశం అవనున్నట్లు సమాచారం. ఈ మీటింగ్ జూన్ 9 లేక 10న జరగనుందట. దీనిలో దౌత్యబృందాలు ఆయా దేశాల్లో తమ పర్యటనల్లో జరిగిన కీలక అంశాలను ప్రధానికి వివరిస్తాయని సమాచారం. అత్యున్నత స్థాయి సమావేశాలు, వ్యూహాత్మక సంభాషణలు, ఆయా ప్రభుత్వాల నుంచి వచ్చిన సమాధానాలను ప్రధానికి తెలియజేస్తారట. అధికార, విపక్ష పార్టీల నేతల నేతృత్వంలో మొత్తం ఏడు దౌత్య బృందాలను వివిధ దేశాలకు భారత్ పంపిన సంగతి తెలిసిందే.

Next Story